డియర్ ప్రధాని మోదీ గారూ... మేమేం చేశామో చూడండి: సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
- అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దన్న ఖర్గే
- కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శలు
- తమ ప్రభుత్వంపై మీరు చేసిన విమర్శలు సరికాదన్న సీఎం
డియర్ నరేంద్రమోదీ గారూ... అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మా ప్రభుత్వంపై మీరు చెప్పిన అవాస్తవాలను సరిదిద్దుతున్నానని పేర్కొన్నారు.
అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ చాలాచోట్ల ప్రజల ముందు దోషిగా నిలబడిందని, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో అభివృద్ధి కుంటుపడి ఆర్థిక పరిస్థితి దిగజారిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై సీఎం స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంపై, మా ప్రభుత్వంపై మీరు చేసిన ప్రకటన సరికాదని, మీ విమర్శల్లో వాస్తవిక లోపాలు ఉన్నాయని, అందుకే నేను వాస్తవాలు మీ ముందు ఉంచుతున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనతో అందరూ ఇబ్బంది పడ్డారని, గత ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో అందరిలోనూ సంతోషం వెల్లివిరిసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేశామని వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల కవరేజీని అమలు చేశామన్నారు. గత పది నెలల కాలంలో తెలంగాణలో 101 కోట్లకు పైగా మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, తద్వారా వారు రూ.3,433.36 కోట్లు ఆదా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రైతులకు భరోసా ఇచ్చే క్రమంలో రైతు రుణమాఫీని అమలు చేశామన్నారు. దీంతో రాష్ట్రంలోని 22,22,365 మంది రైతులు అప్పులు లేకుండా రాజులా జీవిస్తున్నారని తెలిపారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, ఇప్పటికే రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం కేవలం రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తుందని పేర్కొన్నారు. ఈ గ్యాస్ సిలిండర్ల ద్వారా 42,90,246 మంది లబ్ధి పొందినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని... ఇలా వచ్చిన కొన్నిరోజుల్లోనే ఏ బీజేపీ ప్రభుత్వం సాధించని రికార్డ్ సాధించాం అని పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులకు చేసే కేటాయింపులు 40 శాతానికి పైగా పెంచామన్నారు.
నిర్లక్ష్యానికి గురైన మూసీ పునరుజ్జీవానికి తాము అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. నదులు, చెరువులను తాము రక్షిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒక్క అంగుళం చెరువు కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై పవిత్రమైన నిబద్ధత కలిగి ఉన్నామని పేర్కొన్నారు. 11 నెలల కాలంలో బీఆర్ఎస్ చీకటి కోణాన్ని అంతం చేశామన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉదయించిన సూర్యుడిలా ప్రకాశిస్తోందని పేర్కొన్నారు.
కాగా, ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దని, బడ్జెట్‌కు అనుగుణంగా మనం హామీలు ఇవ్వాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తమ పార్టీ రాష్ట్ర యూనిట్లకు సూచించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.