ముంబయి టెస్టులో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
- వాంఖడే స్టేడియంలో భారత్, కివీస్ మూడో టెస్టు
- తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 263 రన్స్‌కు ఆలౌట్
- అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైన కివీస్
- భారత్‌కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 రన్స్‌కు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (90) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. పంత్ హాఫ్ సెంచరీ (60) చేయగా... యశస్వి జైస్వాల్ 30, వాషింగ్టన్ సుందర్ 38 (నాటౌట్) రన్స్ చేశారు. రోహిత్ (18), విరాట్ కోహ్లీ (04), సర్ఫరాజ్ ఖాన్ (0) మరోసారి నిరాశపరిచారు.
న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ వాంఖడేలో సత్తాచాటాడు. ఐదు వికెట్లు తీసి రాణించాడు. హెన్రీ, సోధి, ఫిలిప్స్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు కివీస్ మొదటి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాకు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.