మూడో టెస్టు.. గిల్‌, పంత్ అర్ధ‌శ‌త‌కాలు

  • ముంబ‌యిలో భార‌త్‌, కివీస్ మూడో టెస్టు
  • రెండో రోజు భోజ‌న విరామానికి భార‌త్ స్కోర్ 195/5
  • హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన‌ పంత్ (60), గిల్ (70 నాటౌట్‌)
ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టులో భారత్ నిల‌క‌డ‌గా ఆడుతోంది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 89/4 తో రెండో రోజు ఆట ప్రారంభించిన‌ టీమిండియా భోజ‌న విరామానికి 5 వికెట్లు కోల్పోయి 195 ప‌రుగులు చేసింది. ఐదో వికెట్‌కు పంత్‌, గిల్ జోడి 96 ప‌రుగు‌ల భాగ‌స్వామ్యం అందించింది.  

పంత్ వ‌న్డే త‌ర‌హా బ్యాటింగ్‌తో కేవ‌లం 36 బంతుల్లోనే అర్ధ శ‌త‌కం బాదాడు. 59 బంతుల్లో 60 ప‌రుగులు చేసిన పంత్.. ఇష్ సోధి బౌలింగ్‌లో ఎల్‌బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 8 బౌండ‌రీలు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రోవైపు శుభ్‌మ‌న్ గిల్ (70 నాటౌట్‌) కూడా హాఫ్ సెంచ‌రీతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం క్రీజులో ర‌వీంద్ర జ‌డేజా (10), గిల్ (10) ఉన్నారు. అంత‌కుముందు కివీస్ త‌న తొలి ఇన్నింగ్స్ లో 235 ప‌రుగులకు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో భార‌త్‌ ఇంకా 40 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. 


More Telugu News