జైత్రయాత్రలా సాగిన మంత్రి లోకేశ్ పెట్టుబడుల యాత్ర!
- బ్రాండ్ ఏపీ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్
- పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని నింపిన యువ కెరటం
- వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన మంత్రి లోకేశ్
- 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుస భేటీలు
రాష్ట్రంలో దారితప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి వారం రోజులపాటు యువనేత లోకేశ్ చేపట్టిన అమెరికా టూర్ జైత్రయాత్రలా సాగింది. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేశ్ ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. లోకేశ్‌లో చంద్రబాబు విజన్‌ను చూసిన పారిశ్రామికవేత్తలు బ్రాండ్ ఏపీ మళ్లీ పట్టాలు ఎక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడులపై మంత్రి లోకేశ్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. ప్రస్తుతం ఏపీలో కొలువైన ప్రభుత్వం పనితీరుతో మళ్లీ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ లో జరిగే పెట్టుబడుల సమావేశం నాటికి లోకేశ్ చేసిన తొలి ప్రయత్నం సత్ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆశాకిరణంలా మారారు.
మంత్రి లోకేశ్ ఏం చేశారు?
గతనెల 25వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్ వారం రోజులపాటు 100మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విజనరీ లీడర్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వాన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారం రోజులు అవిశ్రాంతంగా సాగించిన సుడిగాలి పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్ విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూప్, రేవేచర్, సేల్స్ ఫోర్స్, ఫాల్కన్ ఎక్స్, ఈక్వెనెక్స్, జడ్ స్కాలర్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
గత నెల 29వతేదీన లాస్ వేగాస్‌లో 23దేశాల నుంచి 2300 చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు హాజరైన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌కు విశిష్ట అతిథిగా హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమంటూ చైతన్యాన్ని నింపారు. స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో చదవడంతో పాటు ప్రపంచబ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి తాము చేపడుతున్న నిర్మాణాత్మక చర్యలు, డిజిటల్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలను ఆయా కంపెనీల అధినేతలకు తెలియజేశారు. ఏపీపై గత అయిదేళ్లుగా నెలకొన్న దురభిప్రాయాన్ని తొలగించి, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేశ్ కృతకృత్యులయ్యారు.
గత 5 ఏళ్లలో ఏం జరిగింది?
2014-19 నడుమ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రూ.2వేల కోట్ల విలువైన కియా అనుబంధ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.
రేణిగుంటలో రిలయన్స్ (రూ.15వేలకోట్లు), విశాఖలో అదానీ డేటా సెంటర్ (రూ.70వేలకోట్లు), బీఆర్ శెట్టి సంస్థలు (రూ.12వేల కోట్లు), ఒంగోలులో ఏపీ పేపర్ మిల్స్ (రూ.24వేల కోట్లు) ఏర్పాటుకు కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే, వైసీపీ పాలనలో అవన్నీ తరలిపోయాయి. దీంతో పరిశ్రమదారుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించి భరోసా కల్పించడం ద్వారా తిరిగి రాష్ట్రానికి రప్పించే గురుతర బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తలకెత్తుకున్నారు.
బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆపరేషన్
వాస్తవానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఈ ఏడాది జూన్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేశ్ అప్పటి నుంచే ఆపరేషన్ ప్రారంభించారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు పలు దఫాలుగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఏపీఈడీబీ (ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు) సీఈఓ, సీఐఐ ప్రతినిధులు సభ్యులుగా ఏర్పాటైన ఇండస్ట్రీస్ కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.
విశాఖలో రెండుసార్లు ఏపీ ఐటీ అసోయేషన్ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి లోకేశ్ చేపట్టిన చర్యలతో పారిశ్రామికవేత్తలకు నమ్మకం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు భేటీ అయి విశాఖకు టీసీఎస్ రావడానికి ఒప్పించారు. దీనిద్వారా 10వేలమంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
రాష్ట్రంలో ఫాక్స్ కాన్ సిటీని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడకు వచ్చిన హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యాక, మరో 15వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ఆ సంస్థ సిధ్ధమైంది. బ్రాండ్ ఏపీ కోసం కేవలం 4నెలల వ్యవధిలో మంత్రి లోకేశ్ చేసిన ప్రయత్నాలతో పెట్టుబడిదారుల్లో జోష్ నెలకొంది.