పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు... వివరాలు ఇవిగో!
- పెరగని గృహ వినియోగ (డొమిస్టిక్ సిలిండర్) సిలిండర్ ధరలు
- పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట
- పేద, మధ్యతరగతి వర్గాలపై పరోక్షంగా ప్రభావం
చమురు కంపెనీలు శుక్రవారం (నవంబర్ 1) నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ (14.2కిలోలు) ధరను చమురు కంపెనీలు పెంచకపోవడంతో సామాన్య ప్రజలు ఊరట చెందుతున్నారు.
వాణిజ్య సిలిండర్ ధరల పెంపు పేద, సామాన్య ప్రజానీకంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపకపోయినా పరోక్షంగా ఆ ప్రభావం పడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ కు రూ.62లు పెరిగి, రూ.1802లకు చేరుకుంది.
ఇదే సమయంలో చమురు కంపెనీలు ఏటీఎఫ్ ధరలను కూడా పెంచాయి. దీంతో విమాన చార్జీలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన ధరతో ఏ ప్రాంతంలో వాణిజ్య సిలిండర్ ధర ఏ విధంగా ఉందో చూస్తే .. హైదరాబాద్ లో రూ.2028లు, విజయవాడలో రూ.1962, కోల్‌కతాలో రూ.1911.50లు, ముంబయిలో రూ.1754.50లు, చెన్నైలో రూ.1964.50లకు చేరింది.