యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. ఇంతకుముందెన్నడూ లేని విధంగా అక్టోబర్‌లో రికార్డుస్థాయి ట్రాన్సాక్షన్స్!
- అక్టోబర్‌లో రూ. 23.5 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ లావాదేవీల నమోదు
- రోజువారీ యూపీఐ లావాదేవీలు 535 మిలియన్లు
- అలాగే ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లలో 9 శాతం వృద్ధి
- ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)లో 126 మిలియన్ లావాదేవీలు
వరుస పండుగల సందర్భంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత డిజిటల్ లావాదేవీల్లో సరికొత్త రికార్డులు నమోదు కావడం జరిగింది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా అక్టోబర్‌లో రికార్డు స్థాయి లావాదేవీలు జరిగాయి. గత నెలలో దేశవ్యాప్తంగా రూ. 23.5 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. 2016 ఏప్రిల్‌లో యూపీఐ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఒక నెలలో ఇదే అత్యధికమని పేర్కొంది. ఎన్‌పీసీఐ శుక్రవారం పంచుకున్న డేటా ప్రకారం, సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ట్రాన్సాక్షన్ల సంఖ్యలో 10 శాతం, విలువపరంగా 14 శాతం పెరుగుదల నమోదైంది.
అక్టోబర్‌లో రోజువారీ యూపీఐ లావాదేవీలు 535 మిలియన్లు కాగా, వాటి విలువ రూ.75,801 కోట్లు దాటినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. అదే సెప్టెంబర్‌లో రూ. 68,800 కోట్ల విలువైన 501 మిలియన్ల లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది.
ఇక తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీలు అక్టోబర్‌లో 467 మిలియన్లు జరిగితే, సెప్టెంబర్‌లో 430 మిలియన్లుగా ఉంది. దాంతో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లలో 9 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల సంఖ్య సెప్టెంబర్‌లో 318 మిలియన్లతో పోలిస్తే అక్టోబర్‌లో 8 శాతం పెరిగి 345 మిలియన్లకు చేరింది. అక్టోబర్‌లో రూ. 6,115 కోట్ల విలువైన లావాదేవీలు జరిగితే, సెప్టెంబర్‌లో రూ. 5,620 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
అలాగే అక్టోబర్‌లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)లో 126 మిలియన్ లావాదేవీలు జరిగాయి. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 100 మిలియన్లుగా ఉంది. దాంతో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో 26 శాతం లావాదేవీలు పెరిగాయి.
కాగా, ఇండియాలో డిజిటల్ లావాదేవీలు చాలా వేగంగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఆర్థికవేత్త ప్రదీప్ భుయాన్ తెలిపారు. ఇక నగదు వినియోగం ఇప్పటికీ వినియోగదారుల వ్యయంలో 60 శాతం (మార్చి 2024 నాటికి)గా ఉంది.
డిజిటల్ చెల్లింపుల వాటా మార్చి 2021లో 14-19 శాతం నుండి 2024 మార్చిలో 40-48 శాతానికి పెరిగినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.