తెలంగాణకు కొత్త సీఎం రావడం పక్కా... ఇంకెంతో సమయం లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

  • రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల అపాయింట్‌మెంట్ దొరకడం లేదన్న బీజేపీ నేత
  • ఏడు నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శ
  • కేరళ వెళ్లినప్పుడు ప్రియాంకగాంధీని దూరం నుంచి చూసి వచ్చాడని వ్యాఖ్య
తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణకు కొత్త సీఎం వస్తాడని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దల అపాయింట్‌మెంట్ దొరకడం లేదన్నారు. ఏడు నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. కేరళ వెళ్లినప్పుడు కూడా ప్రియాంక గాంధీ ఆయనకు నో చెప్పారన్నారు. ఆమెను దూరం నుంచి చూసి వచ్చాడని ఎద్దేవా చేశారు.

మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచారని ఆరోపించారు. ఇందులో అవినీతి దాగి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణితో ముందుకు సాగుతున్నారని, దీనిని మంత్రులు అంగీకరించడం లేదన్నారు. వచ్చే జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త సీఎం రావడం ఖాయమన్నారు. తాను అన్నీ నిశితంగా పరిశీలించాకే మాట్లాడతానని వెల్లడించారు.


More Telugu News