వైసీపీ వాళ్లకు ఇంకా తిమ్మిరి తగ్గలేదు.. ఆ చట్టం ఈలోపే చూపిస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

  • ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 సభ
  • హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • వైసీపీ సోషల్ మీడియా హ్యాండిళ్లపై నిశిత పర్యవేక్షణ ఉంటుందని వెల్లడి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఐఎస్ జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన దీపం-2 సభలో వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ వాళ్లకు ఇంకా తిమ్మిరి తిమ్మిరిగానే ఉందని అన్నారు. ప్రతి వైసీసీ సోషల్ మీడియా హ్యాండిల్ పై నిశిత పర్యవేక్షణ ఉంటుందని హెచ్చరించారు. మీరు చేసే ప్రతి వ్యాఖ్యను టైమ్ స్టాంప్ తో సహా, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఆడబిడ్డలపై ఎలాంటి దూషణలకు పాల్పడుతున్నాడు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు... ఇలా అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి అని పవన్ స్పష్టం చేశారు. 

సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆడబిడ్డలపై నీచంగా మాట్లాడుతున్నారు... అందరినీ గుర్తిస్తున్నాం... ఎవరూ ఎక్కడికీ పోలేరు... ఇలాంటి వాళ్ల కోసమే డిజిటల్ ప్రైవసీ చట్టం వస్తోంది... అది ఎలా పనిచేస్తుందో ఈలోపే మీకు చూపిస్తాం... ఎవరు తప్పు చేసినా వారిపై క్రిమినల్ రికార్డు ఉంటుంది.... అందుకే, ముందుగా చెబుతున్నాను అంటూ వివరించారు. 

వైసీపీ వాళ్లకు చింత చచ్చినా పులుపు చావలేదు... భవిష్యత్తులో నోట మాట రాకుండా చేస్తాం... మళ్లీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో తిట్టేస్తాం అంటే ఇక కుదరదు... ఏది పడితే అది మాట్లాడుతాం అంటే నేను మీకు మాటిస్తున్నా... లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు... మీ సంగతి చూసే బాధ్యత నాది అని పవన్ ఘాటుగా హెచ్చరించారు. మేం ఏనాడూ మీ ఇంటి ఆడబిడ్డల గురించి అన్యాయంగా మాట్లాడలేదు అని స్పష్టం చేశారు.


More Telugu News