"అన్నా మోసం జరిగిపోయింది క్షమించు" అంటూ పాటలు కూడా..!: పవన్ కల్యాణ్
- ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన
- ఐఎస్ జగన్నాథపురంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- దీపం-2 పథకం ప్రారంభోత్సవానికి హాజరైన డిప్యూటీ సీఎం
- వైసీపీపై ఫైర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో వైసీపీని ఏకిపడేశారు.
ఈవీఎం మిషన్లు మోసం చేశాయట... వీళ్లకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు మోసం చేయలేదు... ఇప్పుడు 11 సీట్లే వచ్చేసరికి ఈవీంఎలు మోసం చేశాయంటున్నారు అని మండిపడ్డారు. "అన్నా... మోసం జరిగింది క్షమించు" అంటూ మళ్లీ దానిపై పాటలు కూడా...! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఓడిపోయిన మూడ్నాలుగు నెలలకే డ్రామాలు, మెలోడ్రామాలకు తెరలేపారని పవన్ కల్యాణ్ విమర్శించారు.
ఇది పగ ప్రతీకారాల ప్రభుత్వం కాదని తాము గెలిచిన రోజునే చెప్పానని వెల్లడించారు. గత నాలుగు నెలలుగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కానీ అవతలి వాళ్లకు నోళ్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైనా వైసీపీ వాళ్ల నోళ్లు మూతపడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల నన్ను అడుగుతున్నారు... ఏంటన్నా మెత్తబడిపోయావు, మంచివాడివైపోయావు అంటున్నారు... నిజమే, నేనెప్పుడూ మంచివాడినే... ఎవరి జోలికి వెళ్లను అని వ్యాఖ్యానించారు.