తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలు స్వీకరించిన టీజీఎస్పీఎఫ్

  • సచివాలయానికి 214 మందితో భద్రత
  • ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవీదాస్ నేతృత్వంలో పూజలు నిర్వహించిన ఎస్పీఎఫ్
  • సచివాలయం భద్రతలో మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం
సచివాలయం భద్రత బాధ్యతలను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) స్వీకరించింది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన 214 మంది నేడు తెలంగాణ సచివాలయం వద్ద భద్రత విధులను చేపట్టారు. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవీదాస్ నేతృత్వంలో భద్రతా సిబ్బంది ఈరోజు సచివాలయం ఆవరణలో పూజలు చేసి బాధ్యతలను స్వీకరించారు.

ఈ క్రమంలో సచివాలయం భద్రతలో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయం గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ప్రభుత్వం టీజీఎస్పీఎఫ్‌కు అప్పగించింది.

మొదట సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రతనే ఉండేది. గత ఏడాది ఏప్రిల్‌లో భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పగించారు. అయితే సచివాలయం భద్రతను తిరిగి ఎస్పీఎఫ్‌కే అప్పగించాలని గత ఆగస్ట్ 5న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈరోజు ఎస్పీఎఫ్ బాధ్యతలను స్వీకరించింది.


More Telugu News