దుల్కర్ 'లక్కీ భాస్కర్', కిరణ్ 'క' తొలిరోజు కలెక్షన్లు ఎంతో తెలుసా...!
- దీపావళి బరిలో నిలిచిన 'లక్కీ భాస్కర్'... 'క'
- తొలిరోజు వసూళ్లను ప్రకటించిన మేకర్స్
- రెండు సినిమాలకూ పాజిటివ్ టాక్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ చిత్రం ఈ దీపావళికి గురువారం నాడు విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, విమర్శకుల అభినందలు లభిస్తున్నాయి.
ఇక దీపావళి సెలవు రోజుల్లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ప్రారంభ వసూళ్లు కూడా లభించాయి. ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కలెక్షన్స్‌ను మెన్షన్ చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల 7 లక్షల గ్రాస్‌ను సాధించినట్లు తెలిపింది.
బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సాధారణ క్లర్క్ గా పనిచేసే ఓ ఉద్యోగి బ్యాంకింగ్ రంగంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని తన తెలివితేటలతో ఎలా కోట్లకు అధిపతి అయ్యాడు అనే అంశాన్ని దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు. మీనాక్షి చౌదరి నాయికగా నటించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన బలంగా నిలిచాయి.
ఈ దీపావళికి బరిలో నిలిచిన మరో చిత్రం 'క'. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరం నటించిన ఈ పీరియాడికల్ యాక్ష్‌న్ థ్రిల్లర్ చిత్రానికి సుజీత్-సందీప్‌లు దర్శకులు. చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నయన్ సారిక నాయికగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కొత్త కాన్సెప్ట్‌తో ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో చివరి ఇరవై నిమిషాలు అందరిని షాకింగ్‌కు గురిచేసే విధంగా సరికొత్తగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్‌గా నటించాడు. కాగా ఈ చిత్రం తొలిరోజు వసూళ్లను కూడా అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం తొలిరోజు రూ. 6 కోట్ల 18 లక్షలు గ్రాస్ సాధించినట్లుగా మేకర్స్ తెలిపారు.