వైసీపీ మునిగిపోయిన నావ.. దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకే జగన్ ఆరాటం: గంటా శ్రీనివాసరావు
- వైసీపీలో ఒకరిద్దరు కూడా మిగలడం కష్టమని ఎద్దేవా
- భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో ఫ్రీగా భోజనం పెట్టాలనే ఆలోచన ఉందన్న గంటా
- స్టీల్‌ప్లాంట్ అంశంలో చిత్తశుద్ధితో ఉన్నామని వెల్లడి
- విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారంటూ వ్యాఖ్య
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకునేందుకే జగన్ తాపత్రయం పడుతున్నారని దుయ్యబట్టారు.
ఇక వైసీపీ మునిగిపోయిన నావ అని, ఒకరిద్దరు కూడా ఆ పార్టీలో మిగలడం కష్టమని ఎద్దేవా చేశారు. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ సాధ్యం కాదన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఏం అంటారని ప్రశ్నించారు. వైజాగ్‌లోని తన నివాసంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధ్వాన రోడ్లపై దృష్టిసారించాం. అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో ఫ్రీగా భోజనం పెట్టాలనే ఆలోచన ఉంది. స్టీల్‌ప్లాంట్ అంశంలో చిత్తశుద్ధితో ఉన్నాం. విశాఖపట్నంకు మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారు అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.