మరో బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన ప్రియురాలు.. ప్రశ్నించినందుకు యువకుడిని చావబాదిన కొత్త ప్రియుడు
- సౌత్ బెంగళూరులోని పద్మనాభనగర్‌లో ఘటన
- యువతితో వాగ్వివాదానికి దిగిన యువకుడు
- తాను ఆ కుర్రాడినే ప్రేమిస్తున్నానని చెప్పడంతో షాక్
- ఈలోగా యువకుడిపై దాడిచేసి చితకబాదిన కొత్త ప్రియుడు
తన ప్రియురాలు మరో యువకుడితో కలిసి కనబడడంతో జీర్ణించుకోలేకపోయిన యువకుడు ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆమె కొత్త ప్రియుడు పాత ప్రియుడిపై దాడిచేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దక్షిణ బెంగళూరులోని పద్మనాభనగర్‌లో జరిగిందీ ఘటన.
చాలా రోజులుగా యువతితో ప్రేమలో ఉన్న రమేశ్ (పేరు మార్చాం) తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలులేవని చెప్పాడు. అయితే, పద్మనాభనగర్‌లో తన ప్రేయసి మరో యువకుడితో కనిపించడంతో తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తేరుకుని వారి వద్దకెళ్లి గొడవకు దిగాడు. దీంతో ఆమె కొత్త ప్రియుడు జోక్యం చేసుకున్నాడు. ఫలితంగా గొడవ మరింత పెద్దదైంది.
ఈ క్రమంలో ఆ యువతి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను అతడిని (కొత్త ప్రియుడు మోహన్) ప్రేమిస్తున్నానని, తమను వదిలేయాలని చెప్పడంతో రమేశ్ నిర్ఘాంతపోయాడు. ఈ లోగా గొడవ పెద్దది కావడంతో రమేశ్ ముఖంపై మోహన్ పిడిగుద్దులు కురిపించాడు. దీంతో భయడిన రమేశ్ ఫోన్ చేసి సోదరుడిని పిలిపించాడు. అయినప్పటికీ అతడిని వదిలిపెట్టని మోహన్ రోడ్డుపై పడేసి రమేశ్ తలను రోడ్డుకేసి బాదాడు. రాయితో తలపై కొట్టాడు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రమేశ్ సోదరుడు మోహన్ నుంచి తన సోదరుడిని రక్షించాడు. ఈ ఘటనపై బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.