గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం... రాజమండ్రికి చేరుకున్న పవన్ కల్యాణ్
- విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన జనసేన నాయకులు, కార్యకర్తలు
- ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం
- గ్రామంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్న పవన్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు మధ్యాహ్నం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జనసేనాని రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఆయనకు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం నుంచి రోడ్డుమార్గంలో ఐఎస్ జగన్నాథపురానికి బయలుదేరారు. ఇక్కడి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సీఎం హాజరవుతారు. అక్కడే ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.
దీపం పథకంలో భాగంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్‌ను ఏపీలోని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకాన్ని అక్టోబర్ 29వ తేదీ నుంచి ప్రారంభించింది. దీపావళి సందర్భంగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఈరోజు నుంచి డెలివరీని ప్రారంభిస్తుంది.