మూడో టెస్టు.. టాస్ గెలిచిన న్యూజిలాండ్‌.. ఒక మార్పుతో బ‌రిలోకి భార‌త్‌

  • ముంబ‌యి వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ మ్యాచ్‌
  • స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి
  • అత‌ని స్థానంలో మ‌హ్మ‌ద్ సిరాజ్ జ‌ట్టులోకి
  • మూడు మ్యాచుల సిరీస్‌ను ఇప్ప‌టికే 2-0తో కైవ‌సం చేసుకున్న కివీస్
ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టులో మొద‌ట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త జ‌ట్టు ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బ‌రిలోకి దిగింది. స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. అత‌ని స్థానంలో మ‌హ్మ‌ద్ సిరాజ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా మొద‌టి రెండు టెస్టులు గెలిచిన కివీస్ ఇప్ప‌టికే సిరీస్ కైవ‌సం చేసుకుంది. 

మరోవైపు భార‌త్ ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ బెర్త్‌కు ఎస‌రు ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే ఎలాగైనా ఈ టెస్టులో గెల‌వాల‌ని రోహిత్ సేన భావిస్తోంది. 

జట్లు:
న్యూజిలాండ్:
టామ్ లాథమ్(కెప్టెన్‌), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, ఇశ్‌ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్


More Telugu News