ముడిచమురు ఎగుమతిలో భారత్ ముందంజ

  • శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో సౌదీ అరేబియాను వెనక్కి నెట్టిన భారత్ 
  • భారీ తగ్గింపుతో భారత్‌కు ముడి చమురును అందిస్తున్న రష్యా
  • గత ఆర్ధిక సంవత్సరంలో రష్యాకు కీలక మార్కెట్‌గా భారత్
యూరప్‌కు అతి పెద్ద ముడి చమురు సరఫరాదారుగా భారత్ నిలిచింది. దీంతో సౌదీ అరేబియా వెనక్కు వెళ్లిపోయింది. కెప్లర్ నివేదిక ప్రకారం .. యూరోపియన్ యూనియన్ దేశాలకు భారతీయ రిఫైనరీల నుంచి శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతిలో గణనీయంగా పెరుగుదల నమోదైంది. యూరోపియన్ దేశాలకు భారత్ ప్రతి రోజూ 3.60 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన ముడి చమురు ఎగుమతి చేసింది. రాబోయే సంవత్సరం ఏప్రిల్ నాటికి ఎగుమతులు 20 లక్షల బ్యారెల్స్‌ను దాటుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్‌కు భారత్ రోజుకు 1.54 లక్షల బ్యారెల్స్ శుద్ధి చేసిన చమురు ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత 2 లక్షల బ్యారెల్స్‌కు పెరిగింది.  
 
2023 ఆర్ధిక సంవత్సరంలో రష్యాకు భారత్ కీలక మార్కెట్‌గా మారింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా భారీ తగ్గింపుతో ముడి చమురును భారత్‌కు అందించింది. పలు దేశాల నుండి విమర్శలు వచ్చినప్పటికీ రష్యా నుంచే భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి 3.35 బిలియన్లు, సౌదీ నుంచి 2.30 బిలియన్లు, ఇరాక్ నుంచి 2.03 బిలియన్ డాలర్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటుంది. దీంతో భారతీయ రిఫైనరీలు హైక్వాలిటీ పెట్రోల్, డీజిల్ ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తులతో సరఫరా గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా సౌదీ ఆరిబియాను కాదని భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి.


More Telugu News