తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్.. ఆయన ఆశయాలతో ముందుకెళ్తాం: మంత్రి నారా లోకేశ్
- అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
- చంద్రబాబు పేరు చెప్పగానే దిగ్గజ కంపెనీల రెడ్ కార్పెట్ వెల్కమ్ అన్న మంత్రి
- సీబీఎన్ బ్రాండ్ తోనే ఫార్చూన్ 500 కంపెనీలతో చర్చలు జరిపినట్లు వ్యాఖ్య
- రెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్ చేస్తామని, తప్పుచేసిన వారిని వదిలేది లేదన్న లోకేశ్
- ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ తెలుగు ఎన్నారైలకు పిలుపు
రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఈరోజు ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తుందంటే అందుకు కారణం సీఎం చంద్రబాబునాయుడేనని అన్నారు. ఐటీ మంత్రిగా టాటా చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం 90 నిమిషాలు చర్చించి టీసీఎస్ తేగలిగానంటే దానికి కారణం కూడా సీబీఎన్ నే అని పేర్కొన్నారు. ఒక్క మెయిల్ తో సత్య నాదెళ్ల అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ పైనుంచి పూలవర్షం కురిపించి ఎన్నారై టీడీపీ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. జోహార్ అన్న ఎన్‌టీఆర్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత జరిగిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. వారంరోజుల అమెరికా పర్యటనలో నేను ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా సీబీఎన్ పేరు చెప్పగానే రెడ్ కార్పెట్ తో వెల్కమ్ చెప్పారు. అదీ ఈరోజు మనకున్న సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్. ఆ బ్రాండ్ తోనే తాను ఫార్చూన్ 500 కంపెనీలకు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని కోరానన్నారు. ఏపీలో ఎటువంటి సంస్కరణలు తెస్తామోనని ఈరోజు దేశమంతా ఆసక్తిగా మనవైపు చూస్తోందని తెలిపారు.
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం..
ఈరోజు తెలుగు వారు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పార్టీని స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం పేరు చెబితే గుర్తుకువచ్చేది విశ్వ విఖ్యాత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారేనన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఏ ఆశయం కోసం పార్టీని స్థాపించారో ఆ ఆశయాలతోనే పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకే సొంతం అన్నారు.
గత ప్రభుత్వంలో చేయని తప్పుకు బాబుగారిని జైలులో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా... ఎన్నారైలతో సహా రోడ్డెక్కి ఆందోళనలు చేశారని, ఆ సమయంలో మీరు ఇచ్చిన మద్దతు మాకు కొండంత బలాన్నిచ్చిందని తెలిపారు. ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా అని బ్రాహ్మణి ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ లో గ్రాటిట్యూడ్ సభకు 45వేల మంది హాజరు కావడం చూశాక, బ్రాహ్మణి మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడలేదన్నారు.
మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్..
వారం రోజుల అమెరికా పర్యటనలో రాష్ట్రాన్ని ప్రమోట్ చెయ్యడానికి అవిశ్రాంతంగా పెట్టుబడిదారులను కలిశాను. కానీ, ఈ రోజు మిమ్మల్ని చూసిన తరువాత నాకు కిక్ వచ్చింది. అందరూ మిమ్మల్ని ఎన్నారైలు అంటారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని ఎంఆర్ఐలు అనే అనుకుంటా. ఎంఆర్ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని అన్నారు. మీ జోష్, ఎనర్జీ చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానా, అమలాపురంలో ఉన్నానా అనే డౌట్ వస్తోందని పేర్కొన్నారు. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తారు. అమెరికాలో ఉన్నా మీ మనసంతా రాష్ట్రం వైపే ఉంటుంది. రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు. అందుకే మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని మంత్రి లోకేశ్ అన్నారు.
సంపాదించిన రూపాయిలో 10పైసలు సొంతగడ్డకు ఖర్చుపెడుతున్నారు. ఇటీవల ఎన్నికల సమయంలో రూ.2లక్షలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొనుక్కొని వచ్చి మరీ ఓటేశారు. కొందరు ఏడాదిపాటు ఏపీలోనే ఉండి సేవలందించారు. చరిత్రలో ఎప్పుడూ రానివిధంగా ఈసారి కూటమి అభ్యర్థులకు మెజారిటీలు వచ్చాయని గుర్తు చేశారు. 92శాతం సీట్లు ఇచ్చారంటూ హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రజలు తనను 91వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారని, రాష్ట్ర ప్రజలంతా సైకోని తరిమికొట్టాలని కంకణం కట్టుకోవడం వల్లే ఇంతటి ఘనవిజయం సాధ్యమైందన్నారు.
ఎన్నారైలు కూడా సైకో బాధితులే..
ఐదేళ్లలో రాష్ట్రం నాశనమైందని, ఎన్నారైలు కూడా సైకో బాధితులేనని లోకేశ్ అన్నారు. కాలిఫోర్నియాలోని ఒక వ్యక్తి రూ. 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారు. వైసీపీ వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారు. అడుగడుగునా అవమానించారు, అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారని గుర్తు చేశారు. తాను కూడా గత ప్రభుత్వంలో బాధితుడ్నేనని తెలిపారు. తాను యువగళం పాదయాత్ర చేస్తుంటే జీఓ1 తెచ్చి అడ్డుకోవాలని చూశారని, ఆ జీఓను మడతపెట్టి జేబులో పెట్టుకోమని చెప్పినట్లు పేర్కొన్నారు. పాదయాత్రలో మాట్లాడుతుంటే తన స్టూల్, మైక్ లాగేశారని, అడుగడుగునా ఇబ్బంది పెట్టినట్టు తెలిపారు. ఆ సమయంలో నాకు అండగా నిలచింది టీడీపీ కార్యకర్తలేనని చెప్పారు. ఆరోజే ఎర్ర బుక్కు గురించి చెప్పా, ఇప్పుడు జగన్ గుడ్ బుక్ తెరుస్తాడంట, నోట్ బుక్ చదవడమే రాదు, గుడ్ బుక్ లో ఏం రాస్తారు? అని ఎద్దేవా చేశారు. గత అయిదేళ్ల అరాచక పాలనలో పెట్టుబడులు పొరుగురాష్ట్రాలకు వెల్లిపోయాయని, ఇప్పుడు పెట్టుబడులు తెచ్చే బాధ్యత కూడా తనపై ఉందన్నారు.
వారికి సినిమా చూపించే బాధ్యత నాది..
రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయింది.. రెండోది ఓపెన్ అయింది.. మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి అని లోకేశ్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నానని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారని, చంద్రబాబు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2 నిమిషాల పని అని అన్నారు. చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు. ప్రజలు మనకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలని తెలిపారు.
గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందన్నారు. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలుచేస్తామని చెప్పుకొచ్చారు. తాను తగ్గేదే లేదని, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత తనేదేనని అన్నారు. తాము కూడా మనుషులమేనని, విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయన్నారు. అంతమాత్రాన అలిగి పడుకోవద్దని, తమ దృష్టికి తెస్తే సరిచేసుకుంటామన్నారు. మీకు ఉన్న సమస్యలు కొన్ని తన దృష్టికి తీసుకొచ్చారని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఎన్నారైలతో మంత్రి లోకేశ్ అన్నారు.
ప్రతి తెలుగువాడు పారిశ్రామికవేత్త కావాలి..
తెలుగువారు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నది బాబుగారి ఆశయమన్నారు మంత్రి లోకేశ్. ఏపీఎన్ఆర్‌టీ ద్వారా ఆదాయాన్నిపెంచేందుకు స్కిల్ శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి తెలుగువాడు పారిశ్రామికవేత్త కావాలన్నారు. అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం తెలుగువారిదేనని తెలిపారు. ఎన్ఆర్ఐలు ఏపీలో పెట్టుబడి పెట్టాలని, వారికి అండగా నిలిచే బాధ్యత తనదేనన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగాలిస్తేనే మనం మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలబడతాం. ఇందుకు ఎన్ఆర్ఐలు తమ వంతు సహకారం అందించాలన్నారు. వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్‌కు ఐదేళ్లు పట్టిందని, చంద్రబాబు మూడు వేల పెన్షన్ ను ఒకే ఒక్క సంతకంతో నాలుగు వేలు చేశారన్నారు. వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ వెయ్యలేదని విమర్శించారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,500 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిందని పేర్కొన్నారు. సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని, దీపావళి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని మనం నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు.