ఓటీటీలోకి వస్తున్న వేట్టయాన్
- రజనీకి మరో హిట్ తెచ్చిపెట్టిన సినిమా 'వేట్టయాన్'
- ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
- తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి మూవీ
ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన 'వేట్టయాన్' మూవీ ఓటీటీ రిలీజ్‌కు తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ పోలీస్ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
ఇక భారీ అంచనాల నడుమ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. జైలర్ తర్వాత రజనీ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ యాక్షన్ .. కథలోని ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. యాక్షన్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ చిత్రంలో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషించారు.