దీపావళికి ఇల్లు శుభ్రం చేస్తున్న మహిళకు ఆశ్చర్యం... చెల్లని రూ.500, రూ.1,000 నోట్లు లభ్యం
- పెద్ద మొత్తంలో కంటబడిన చెల్లని పాత నోట్లు
- రహస్య పొదుపు అని వెల్లడించిన మహిళ
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాత నోట్ల వీడియో
దీపావళి సందర్బంగా ఇంటిని శుభ్రం చేస్తున్న ఓ మహిళకు ఆశ్చర్యకర దృశ్యం ఎదురైంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు దాచిపెట్టిన పాత రూ.500, రూ.1,000 నోట్లు బయటపడ్డాయి. ఇవి రహస్యంగా పొదుపు చేసిన డబ్బులు అని, అయితే నోట్ల రద్దు జరిగిన కొన్నేళ్ల తర్వాత కంటబడడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె పేర్కొంది.
అత్యవసర పనుల కోసం దాచిపెట్టామని, నోట్ల రద్దు సమయంలో మార్చుకోవడం మరచిపోయామని తెలిపింది. కాగా ఇందుకు సంబంధించి సదరు మహిళ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రూ.500, రూ.1,000 నోట్లు పెద్ద సంఖ్యలోనే కనిపించాయి. ఇప్పటికే 22 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.
చూశారా అన్ని సంవత్సరాలు ఇంట్లో ఎవరి కంటపడకపోయినప్పటికీ.. దీపావళి క్లీనింగ్ ఎలా బహిర్గతం చేసిందో చూడండని ఓ వ్యక్తి సరదా కామెంట్ చేశామగ. “అందుకే డబ్బు విషయంలో నా భర్య నన్ను నమ్మదు!” అని ఓ వ్యక్తి హాస్యం పండించాడు.
మరచిపోయిన వస్తువులు కొన్ని వస్తువులు ఇంటిని శుభ్రం చేసే సమయంలో దొరుకుతుంటాయని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ఆ నోట్లు ఇంకా వినియోగంలో ఉండి ఉంటే...! అని ఓ వ్యక్తి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. డీమోనిటైజేషన్ జరగడానికి ముందే ఆమె క్లీనింగ్ చేసి ఉంటే బావుండేదని ఒకరు, దీపావళికి ముందే ఈ డబ్బు కనపడడం భలే ఉందని ఇంకొకరు వ్యాఖ్యానించారు.