నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

  • రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫైనాన్షియల్, ఐటీ స్టాక్స్‌లో వెల్లువెత్తిన అమ్మకాలు
  • 553 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • సెన్సెక్స్-30 స్టాక్స్‌లో నష్టాల్లో ముగిసిన 22 స్టాక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, అటు, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉండడంతో... ఆ ప్రభావం భారత మార్కెట్‌పై పడింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 79,389 వద్ద ముగియగా... నిఫ్టీ 135 పాయింట్లు క్షీణించి 24,205 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్-30 స్టాక్స్‌లో ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, జేఎస్‌బ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సన్ ఫార్మా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర వంటి ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి.


More Telugu News