చాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన అంబేద్కర్ మనవడు
- ఈ ఉదయం చాతీలో నొప్పితో బాధపడిన ప్రకాశ్ అంబేద్కర్
- పూణెలోని ఆసుపత్రికి తరలింపు
- గుండెలో రక్తం గడ్డకట్టినట్టు గుర్తించిన వైద్యులు
- ఈ రోజు యాంజియోగ్రామ్ చేసే అవకాశం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ ఈ ఉదయం చాతీలో నొప్పితో ఫూణెలోని ఆసుపత్రిలో చేరారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. లాయర్, హక్కుల కార్యకర్త అయిన ప్రకాశ్ అంబేద్కర్.. బాలాసాహెబ్ అంబేద్కర్‌గా అందరికీ సుపరిచితులు. అకోలా నుంచి రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
ప్రకాశ్ అంబేద్కర్‌కు గుండెలో రక్తం గడ్డకట్టుకుపోవడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ రోజు యాంజియోగ్రామ్ నిర్వహిస్తారని ఆయన పార్టీ వీబీఏ తెలిపింది. మూడు నుంచి ఐదు రోజులు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని పేర్కొంది.