ముంబ‌యి న‌టి జెత్వానీ కేసులో కీల‌క ప‌రిణామం

  • విచారణ ప్రారంభించిన సీఐడీ
  • జెత్వానీ, ఆమె పేరెంట్స్ నుంచి వాంగ్మూలం సేక‌రించిన‌ అధికారులు
  • ఈ కేసు తాలూకు డాక్యుమెంట్లు ఇబ్ర‌హీంప‌ట్నం పోలీసుల నుంచి స్వాధీనం      
ముంబ‌యి న‌టి జెత్వానీ కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు విచార‌ణ ప్రారంభించారు. జెత్వానీ, ఆమె పేరెంట్స్ నుంచి అధికారులు వాంగ్మూలం సేక‌రించారు. అలాగే ఈ కేసు తాలూకు డాక్యుమెంట్ల‌ను ఇబ్ర‌హీంప‌ట్నం పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

ఇక ఈ కేసులో ఇప్ప‌టికే వైసీపీ నేత కుక్క‌ల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వైసీపీ ప్రోద్బ‌లంతో అక్ర‌మ కేసులు పెట్టార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టికే ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ, కాంతిరాణా తాతా, పీఎస్ఆర్ ఆంజ‌నేయులుతో పాటు మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. ఆయా అధికారుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం స‌స్పెన్ష‌న్ వేటు వేసిన విష‌యం తెలిసిందే. 


More Telugu News