50 ఏళ్ల కెరియర్లో ఎంత సంపాదించానంటే!: నటి రోహిణి
- బాలనటిగా 75 సినిమాలు చేసిన రోహిణి
- మలయాళంలో సీనియర్ హీరోయిన్ గా పేరు
- ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్నానని వెల్లడి
- హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉందన్న రోహిణి
నటిగా .. డబ్బింగ్ ఆర్టిస్టుగా రోహిణికి మంచి పేరు ఉంది. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా ఆమె తెలుగులో బిజీగా ఉన్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. "బాలనటిగా వివిధ భాషల్లో నేను 75 సినిమాల వరకూ చేశాను. వాటిలో తెలుగు సినిమాలే ఎక్కువ. శ్రీదేవి గారు నాకంటే సీనియర్. ఇంతవరకూ 350కి పైగా సినిమాలు చేశాను" అని అన్నారు.
" తెలుగులో హీరోయిన్ వేషాల కోసం నన్ను ఎవరూ అడగలేదు. తమిళంలో హీరోయిన్ గా ఓ పది సినిమాల వరకూ చేశానుగానీ .. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. మలయాళంలో హీరోయిన్ గా చాలా సినిమాలు చేశాను. అక్కడ నాకు మంచి సక్సెస్ రేటు ఉండేది. 'అలా మొదలైంది'కి ముందు వరకూ తెలుగులో నన్ను పట్టించుకోలేదు. ఆ సినిమా నుంచి మళ్లీ ఇక్కడ బిజీ అయ్యాను. ఇప్పుడు కూడా నెలకి 20 రోజులు హైదరాబాదులో ఉంటున్నాను. అందువలన త్వరలో చెన్నై నుంచి ఇక్కడికి మారే ఆలోచన ఉంది" అని చెప్పారు.
" నేను చాలా యంగ్ గా కనిపిస్తున్నానని చాలామంది అంటున్నారు. అందుకు కారణం నా ఆహారపు అలవాట్లే. 50 ఏళ్ల కెరియర్లో బాగా సంపాదించానని అనుకోవడం సహజం. మలయాళం సినిమాలు ఎక్కువ చేశాను .. అవి బడ్జెట్ సినిమాలు. ఇప్పుడు చేస్తున్నవి కేరక్టర్ ఆర్టిస్టుగా .. ఎంత ఇస్తారనేది అందరికి తెలిసిందే. కనుక ఆర్ధికంగా చూసుకుంటే ఓకే అని చెప్పగలను. కొత్త దర్శకులు కూడా నన్ను గుర్తుపెట్టుకుని అవకాశాలు ఇస్తుండటం సంతోషంగా ఉంది" అని అన్నారు.