కేబీసీలో క్రికెట్‌పై ప్ర‌శ్న.. మీరు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రేమో ట్రై చేయండి!

  • అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్యాత‌గా కేబీసీ 16వ సీజ‌న్
  • కంటెస్టెంట్‌కు రూ. 6.40ల‌క్ష‌ల‌కు గాను టెస్టు క్రికెట్‌పై ప్ర‌శ్న
  • 2022లో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 500కి పైగా ర‌న్స్‌ చేసిన మొదటి జట్టు ఏది? 
  • ఈ ప్ర‌శ్న‌కు అప్ష‌న్స్‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జ‌ట్ల పేరు
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి (కేబీసీ) 16వ సీజ‌న్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. దీనిలో భాగంగా తాజాగా ఓ కంటెస్టెంట్‌కు రూ. 6.40ల‌క్ష‌ల‌కు గాను టెస్టు క్రికెట్‌పై ఒక ప్ర‌శ్న వేశారు బిగ్‌బీ. 

'2022లో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి జట్టు ఏది?' అనేది ఆ ప్ర‌శ్న. ఈ ప్ర‌శ్న‌కు అప్ష‌న్స్‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జ‌ట్ల‌ను ఇచ్చారు. అయితే, క్రికెట్‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న కంటెస్టెంట్ వెంట‌నే క‌రెక్ట్ ఆన్స‌ర్ ఇచ్చారు. 

ఈ ప్రశ్నకు సరైన సమాధానం 'ఇంగ్లండ్'. 2022 డిసెంబర్ 1న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 506/4 స్కోర్ చేసింది. తమ 'బజ్‌బాల్‌' ఆటతో పాక్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది. టీ20 త‌ర‌హా బ్యాటింగ్‌తో ఒకేరోజు 500కి పైగా ప‌రుగులు చేసింది. త‌ద్వారా ఇంగ్లండ్ టెస్టుల్లో తొలిరోజు 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా అవతరించింది. ఆ టూర్‌లో పాక్‌ను చిత్తు చేసి ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.


More Telugu News