మా కోసం మా అమ్మ కూలి పనులకు వెళ్లేది: కన్నీళ్లు పెట్టుకున్న కిరణ్ అబ్బవరం

  • కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'క'
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • తన నేపథ్యం చెప్పుకుని బాధపడిన హీరో 
  • తనపై ట్రోలింగ్ ఆపమని రిక్వెస్ట్  

కిరణ్ అబ్బవరం .. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన హీరో. కొంత గ్యాప్ తరువాత ఆయన చేసిన 'క' సినిమా, ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిన్నరాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆయన ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. "మా అమ్మ పల్లెటూళ్లో పుట్టి పెరిగింది. మా కోసం ఆమె కూలి పనులకు వెళ్లేది. మమ్మల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివించడం కోసం ఆమె 'కువైట్' వెళ్లింది. 20 ఏళ్లలో నేను మా అమ్మ దగ్గర ఓ రెండు సంవత్సరాలు ఉన్నానేమో" అన్నాడు. 

" పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్లిపోయిన మా అమ్మ, ఎన్నో కష్టాలు పడుతూ కువైట్ లోనే ఉండిపోయింది. ఆ తరువాత అక్కడి నుంచి వచ్చి కట్టిన ఇల్లు కూడా ఆ తరువాత మా కోసమే అమ్మేసింది. ఏదైనా సాధించాలిరా అనేట్టుగా ఆమె ప్రవర్తన ఉండేది. మా అమ్మ చదువుకున్నది ఐదవ తరగతినే. పెద్దగా చదువుకోని ఆమెనే ఇతర దేశాలకి ధైర్యంగా వెళ్లి వస్తే, చదువుకున్న నేను ఎంత సాధించాలి అనుకున్నాను. ఆ పట్టుదలనే ఇక్కడి వరకూ నడిపించింది" అన్నాడు. 

" ఇక నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కొందరు నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నేను ఓ రాజకీయనాయకుడు కొడుకుననీ, బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చానని ప్రచారం చేశారు. చివరికి ఒక సినిమాలో నన్ను ట్రోల్ చేస్తూ సీన్ పెట్టారు. నేను అంటే ఎందుకింత కోపం? నేను ఎన్నో కష్టాలు పడ్డాను .. ఎన్నో దాటుకుంటూ ఇక్కడి వరకూ వచ్చాను. మా అమ్మ గర్వపడేలా చేయడమే నా ఉద్దేశం .. అది నెరవేరనీయండి" అని ఉద్వేగానికి లోనయ్యాడు.


More Telugu News