సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ భేటీ

  • టెక్ స్టార్టఫ్‌ల‌కు ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ అందించాల‌ని విజ్ఞ‌ప్తి
  • ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ శిక్షణ ఇవ్వాల‌ని కోరిన మంత్రి
  • ఐన్‌స్టీన్ ఏఐని ఏపీలో పరిచయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి
సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షిహ్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ లాస్ వెగాస్ లోని సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ డ్రైవెన్ ఎకానమీపై త‌మ ప్ర‌భుత్వం దృష్టిసారించింద‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకారం అందించాల‌ని కోరారు. ఏపీలో ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి శ్రామిక శక్తిని సిద్ధం చేయాల‌ని తెలిపారు. సేల్స్‌ఫోర్స్ ఏఐ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యా సంస్థలతో భాగస్వాములు కావాల‌న్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్‌లకు ఏఐ టూల్స్, మెంటార్‌షిప్‌ను అందించాల‌ని కోరారు. 

ఐన్‌స్టీన్ ఏఐని ఏపీలో పరిచయం చేయండి..
ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం)ని మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్ తాలూకు ఐన్‌స్టీన్ ఏఐ ఏపీలో పరిచయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఏఐ-పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనారంగంలో సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు సహకారం అందించాల‌ని కోరారు. ఏపీలో ఈ-గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ను అమలు చేయడం, సర్వీస్ డెలివరీ మెకానిజంను మెరుగుపర్చడం, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేటెడ్ ప్రాసెస్‌ల ద్వారా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌ను అమలు చేయడానికి సేల్స్‌ఫోర్స్ సహకారాన్ని కోరారు. పరిపాలనలో ఏఐ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాల‌న్నారు. ఏపీలో అమలయ్యే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగ మంత్రి లోకేశ్‌ కోరారు. 

నైతికతతో కూడిన ఏఐపై దృష్టి సారించాం: క్లారా షిహ్ 
ఈ సందర్భంగా క్లారా షిహ్ మాట్లాడుతూ... సేల్స్ ఫోర్స్ ఏఐ వ్యూహ పర్యవేక్షణ, కస్టమర్ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్ (సీఆర్ఎం)లో ఆఫర్లను మెరుగుపర్చడం, ఏఐ అండ్‌ మిషన్ లెర్నింగ్ లో నవీన ఆవిష్కరణలపై తాము దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. ఐన్‌స్టీన్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధికి కసరత్తు చేస్తున్నామ‌ని తెలిపారు. కస్టమర్ మనోభీష్టానికి అనుగుణంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యాపార విధుల్లో ఆటోమేషన్‌ కోసం ఏఐ టూల్స్‌ రూపొందించడం వంటి సేవలు అందిస్తున్నామ‌న్నారు. 

సేల్స్‌ఫోర్స్ ఏఐ సంస్థ నైతికతతో కూడిన కృత్రిమమేధపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రభుత్వరంగ ప్రాజెక్టులలో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి తాము కట్టుబడి ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఏఐ అండ్‌ ఎంఎల్ నూత‌న‌ ఆవిష్కరణల్లో దూసుకుపోతున్న తమ సంస్థ ప్రస్తుతం 287 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ సహచర బృందంతో చ‌ర్చిస్తామ‌ని క్లారా షిష్ పేర్కొన్నారు. 



More Telugu News