సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని గౌరవప్రదంగా సాగనంపుతున్న ఏపీ ప్రభుత్వం

  • గోపాలకృష్ణ ద్వివేదికి ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల సంక్షేమ విభాగం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు
  • ఈ నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న గోపాలకృష్ణ ద్వివేది
ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ఏపీలోని కూట‌మి ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వారిని గౌరవప్రదంగా సాగనంపాల‌నే ఉద్దేశంతో స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. 

దీనిలో భాగంగా గోపాలకృష్ణ ద్వివేదికి ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల సంక్షేమ విభాగం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ప్ర‌స్తుతం ఆ పోస్టును పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌ల‌తో పోలా భాస్క‌ర్ నిర్వ‌హిస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేది ఈ నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తుండ‌టంతో ఆయ‌నను గౌరవప్రదంగా సాగనంపేందుకు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇచ్చింది.     

ఇక వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వివాదాస్ప‌ద అధికారులుగా పేరొందిన వారికి కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోస్టింగులు ఇవ్వ‌కుండా ప‌క్క‌నపెట్టింది. కానీ వారి ప‌ద‌వీ విర‌మ‌ణ తేదీ ద‌గ్గ‌ర ప‌డేస‌రికి పోస్టింగ్ ఇచ్చి గౌర‌వ‌ప్ర‌దంగా పంపిస్తోంది. జ‌వ‌హర్ రెడ్డి, ర‌జ‌త్ భార్గ‌వ‌, పూనం మాల‌కొండ‌య్యల‌కు కూడా ప్ర‌భుత్వం ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందు పోస్టింగ్‌లు ఇచ్చింది. 


More Telugu News