పెట్రోల్ బంక్ డీలర్లకు కమీషన్ పెంపు... ఈ ప్రాంతాల్లో పెట్రోల్ ధరలో తగ్గుదల... ఎంతంటే?
- డీలర్ల కమిషన్ పెంపుతో పలు ప్రాంతాల్లో వినియోగదారులకూ ఊరట
- దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాస్త తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- రేపటి నుంచి కమీషన్ పెంపు అమల్లోకి వస్తుందని వెల్లడి
పెట్రోల్ బంక్ డీలర్లకు చమురు రంగ కంపెనీలు దీపావళికి ముందు తీపి కబురును అందించాయి. పెట్రోల్ బంక్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇది రేపటి నుంచి (అక్టోబర్ 30) నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించాయి. డీలర్ల కమిషన్ పెంచితే పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఊరట దక్కనుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంచినందు వల్ల వినియోగదారులపై అదనపు ప్రభావం పడదని స్పష్టం చేశాయి. కస్టమర్ సేవా ప్రమాణాలు పెంచేందుకు, రిటైల్ అవుట్‌లెట్‌లలో పని చేసే సిబ్బంది సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ నిర్ణయం వల్ల పలు ప్రాంతాల్లో రిటైల్ అమ్మకపు ధరలు తగ్గుతాయని పేర్కొంది.
వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 అంతకంటే ఎక్కువగా తగ్గే అవకాశముంది. ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.2.09 నుంచి రూ.2.70 వరకు, అరుణాచల్ ప్రదేశ్‌లో రూ.3.02 నుంచి రూ.3.96 వరకు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరాం, ఒడిశా రాష్ట్రాలలోనూ రూ.2 నుంచి రూ.4.69 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.