సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం చంద్రబాబు
- గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు
- గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు
- ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై వివరాలు తెలిపిన వైనం
ఏపీ సీఎం చంద్రబాబు, తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పిన చంద్రబాబు... ఆయనకు జ్ఞాపికను కూడా బహూకరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు గవర్నర్ తో కాసేపు సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలనా విధానాలను వివరించారు. దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చంద్రబాబు గవర్నర్ కు తెలియజేశారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధివిధానాలను ఆయనకు వివరించారు.