ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాక్స్‌వెల్‌ను బ్లాక్ చేసిన విరాట్ కోహ్లీ... ఆసక్తికర విషయం చెప్పిన ఆసీస్ స్టార్
- 2017లో టెస్ట్ మ్యాచ్ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం
- అందుకే ఆసీస్‌ను ఆటగాడిని బ్లాక్ చేసిన విరాట్
- స్పోర్ట్స్ పోస్ట్‌కాస్ట్‌తో మాట్లాడతూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్న మ్యాక్స్‌వెల్
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు గత నాలుగేళ్లుగా కలిసి ఆడుతున్న స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ మైదానంలో స్నేహంగా మెలగడం చాలాసార్లు కనిపించింది. మ్యాచ్ విరామాల్లో కలిసి రెస్టారెంట్లు, పార్టీలకు వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒకానొక సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాక్స్‌వెల్‌ను విరాట్ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని ఈ ఆస్ట్రేలియా ఆటగాడే స్వయంగా వెల్లడించాడు.
2021 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ జట్టుతో కలిసినప్పుడు తనను మొదట స్వాగతించిన ప్లేయర్ విరాట్ కోహ్లీ అని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. ప్రీ-ట్రైనింగ్ సెషన్‌తో పాటు ట్రైనింగ్ సెషన్‌లో కూడా ఇద్దరం కలిసి మాట్లాడుకునేవారమని, అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని ఫాలో అయ్యేందుకు సెర్చ్ చేయగా అతడి ఐడీ కనిపించలేదని అన్నాడు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాడనే కచ్చితమై అవగాహన ఉందని పేర్కొన్నాడు. తనను కోహ్లీ బ్లాక్ చేసి ఉండొచ్చని ఒకరు చెప్పడంతో కోహ్లీని ఒకసారి అడిగానని వివరించాడు.
‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో నువ్వు నన్ను బ్లాక్ చేశావా అని అడిగాను. అవును... చేసి ఉండొచ్చని కోహ్లీ అన్నాడు. టెస్ట్ మ్యాచ్ సమయంలో మైదానంలో నువ్వు నన్ను ఎగతాళిగా అనుకరించినప్పుడు బ్లాక్ చేయాలని నిర్ణయించుకున్నానని కోహ్లీ అన్నాడు. ఆ తర్వాత అన్‌బ్లాక్ చేశాడు. ఫాలో అయ్యాను. ఆ తర్వాత మేమిద్దరం గొప్ప స్నేహితులుగా మారాం’’ అని మాక్స్‌వెల్ వెల్లడించాడు.
కాగా 2017లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో తామిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందని మ్యాక్స్‌వెల్ గుర్తుచేసుకున్నాడు. ‘లిజనర్ స్పోర్ట్ పోడ్‌కాస్ట్’లో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నాడు.
కాగా ఐపీఎల్ 2021కు ముందు మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ ఏకంగా రూ.14.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అప్పటినుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ, మాక్స్‌వెల్, ఆర్సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ వీరు ముగ్గురు కలిసి కొన్ని సీజన్లలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. కాగా ఏడాది మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటెయిన్ చేసుకుంటుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.