అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై దీపావళి స్పెషల్ ఆఫర్లు... రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!
- ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజాలు
- బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న పలు కంపెనీల స్మార్ట్‌ఫోన్లు
- అక్టోబర్ 31 వరకు కొనసాగనున్న ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్స్
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై దీపావళి సేల్స్ సందర్భంగా కొన్ని పాపులర్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఆఫర్లలో లభిస్తున్నాయి. కొన్ని ఫోన్లను రూ.15,000 లోపు ధరకు దక్కించుకోవచ్చు. ఆ ఫోన్లు ఏమిటి, వాటి ఫిచర్లు ఎలా ఉన్నాయో గమనిద్దాం..
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35 ధర రూ.14,999. డిస్కౌంట్లు పోనూ రూ.13,749కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6.6-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్ జ్ రిఫ్రెష్ రేట్, ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ఉన్నాయి. ఇక ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ షూటర్, 8ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్, 2ఎంపీ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
రియల్‌మీ నార్జో 70 టర్బో
రియల్‌మీ నార్జో 70 టర్బో స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.16,998 కాగా ప్రస్తుతం రూ.14,998కి అందుబాటులో ఉంది. 6.67-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్ జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
పోకో ఎక్స్6
పోకో ఎక్స్6 అసలైన రూ. 15,999 కాగా డిస్కౌంట్‌లతో కలిసి రూ.14,999కి అందుబాటులో ఉంది. పోకో ఎక్స్6 స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ప్రాసెసర్, 120 హెర్ట్ జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5100ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. వెనుకవైపు ప్రధానంగా 64 ఎంపీ మెయిన్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
సీఎంఎఫ్ ఫోన్ 1
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ సీఎంఎఫ్ ఫోన్ 1 ధర రూ.14,999గా ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌లతో ఈ ఫోన్‌ను రూ.12,999 ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఈ ఫోన్ పనిచేయనుంది. రెండు సంవత్సరాలపాటు ఓఎస్ అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అసలు ధర రూ. 21,999గా ఉండగా బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ. 14,999కి దక్కించుకోవచ్చు. 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం మెరుగైన 108ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ చిన్న కెమెరా కూడా ఉంది.
కాగా అక్టోబర్ 21న మొదలైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్-2024 అక్టోబర్ 31న ముగుస్తుంది. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2024 నేటితో (2024 అక్టోబర్ 29) ముగియనుంది.