సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను విడగొట్టేస్తారు సుమీ!
- రచయితగా గోపీమోహన్ కి మంచి పేరు
- అనేక హిట్స్ ఇచ్చిన రచయిత
- ఈర్ష్య అసూయ ద్వేషాలు నచ్చవని వెల్లడి
- ఇక్కడ అలాంటివారు ఎక్కువని వ్యాఖ్య
తెలుగులో రచయితగా చాలా సినిమాలకు గోపీమోహన్ పని చేశారు. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలకు ఎక్కువగా పనిచేశారు. అలాంటి ఆయన తాజాగా 'ట్రీ మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన జర్నీ గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఇంజనీరింగ్ పూర్తవుతున్న సమయంలో నాకు సినిమాలపై ఇష్టం మరింతగా పెరిగిపోయింది. మణిరత్నం .. కృష్ణవంశీ వంటి వారి సినిమాలు చూసిన తరువాత దర్శకుడిని కావాలనే కోరిక పెరిగింది" అని చెప్పారు.
" సినిమాల దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. సునీల్ .. ఆర్పీ పట్నాయక్ .. దశరథ్ పరిచయమయ్యారు. అప్పుడప్పుడే వాళ్లకి అవకాశాలు వస్తున్నాయి. అలా వాళ్లతో కలిసి నా ప్రయాణం మొదలైంది. నేను ఏ దర్శకుడితో కలిసి పనిచేస్తున్నా, ముందుగా వాళ్ల మైండ్ సెట్ ను అర్థం చేసుకుని, దానికి దగ్గరగా వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటాను" అని అన్నారు.
"నేను మాస్ మసాలా సినిమాలకు పెద్దగా సూట్ అవ్వను. కొంతమంది దర్శకులు .. కొన్ని కథలు నాకు సెట్ కావని అనుకున్నప్పుడు .. నేను ట్యూన్ కాలేనని అనిపించినప్పుడు తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఆ పని సున్నితంగా చేసేవాడిని .. ఎవరితోనూ ఎలాంటి వివాదాలు లేవు. ఇక్కడ ఎప్పుడూ ఈర్ష్య ద్వేషాలతో ప్రవర్తిస్తూ, మన కాలుపట్టుకుని లాగేయాలని చూసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఒక సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నడుస్తుంటే, ఆ కాంబినేషన్ ను ఎలాగైనా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది తమ స్వార్థం కోసం, ఒక్కో చుక్కా విషం వేసి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ను విడదీసినవారిని .. విడగొట్టినవారిని నేను చూశాను. అలాంటి ఒక ధోరణి నాకు నచ్చదు" అని చెప్పారు.