ఆరోజు రేవంత్ రెడ్డిని జైల్లోనే చంపేందుకు కుట్ర చేశారు: షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు
- అండర్ ట్రయల్ ముద్దాయిని చంపాలని కుట్ర చేశారని ఆరోపణలు
- కేటీఆర్ డ్రగ్స్ తీసుకోకపోతే నార్కోటిక్ పరీక్షలకు సిద్ధం కావాలని షబ్బీర్ అలీ సవాల్
- విదేశీ మద్యం సీసాలతో దొరికిన బావమరిదిని కేటీఆర్ వెనుకేసుకొస్తున్నాడన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జన్వాడ ఫాంహౌస్‌కు సంబంధించి వాస్తవాలను బయటపెట్టినందుకు మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని 14 రోజులు జైల్లో ఉంచారని, అండర్ ట్రయల్ ముద్దాయిగా ఉంచి... చంపాలని కుట్ర చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కేవలం అడిగేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితేనే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన దౌర్జన్యంలో తాము ఒక్క శాతం కూడా చేయడంలేదన్నారు. హవాయి చెప్పుల నుంచి విమానంలో తిరిగే స్థాయికి కేసీఆర్ కుటుంబం ఎలా వెళ్లిందని నిలదీశారు.
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డ్రగ్స్ తీసుకోకపోతే కేటీఆర్ నార్కోటిక్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు వెనకేసుకుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన 50 మంది ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతోనే పోలీసులు సోదాలు నిర్వహించారని తెలిపారు. ఇంట్లో పార్టీ జరిగిందని కేటీఆర్ చెబుతున్నారని, మరి విదేశీ మద్యం ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు.
ఇక, 16 విదేశీ మద్యం సీసాలతో దొరికిన బావమరిదిని కేటీఆర్ వెనుకేసుకొస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఇలా చేస్తే కేటీఆర్ రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమని హెచ్చరించారు. తొమ్మిదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన కేటీఆర్‌కు విదేశీ మద్యం కోసం అనుమతులు తీసుకోవాలనే విషయం తెలియదా? అని నిలదీశారు. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో డ్రగ్స్ వాడినట్లుగా కూడా అభియోగాలు ఉన్నాయని, దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.