టీడీపీలో సభ్యత్వ నమోదు చేయించుకున్న బాబూమోహన్
- నాడు టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాబూమోహన్
- ఆ తర్వాత టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్)లో చేరిక
- కాలక్రమంలో బీజేపీలోనూ చేరిన వైనం
- ఈ ఏడాది ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబూ మోహన్
- తాజాగా, మళ్లీ పాత గూటికి చేరిక
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్టోబరు 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా, ప్రముఖ సినీ నటుడు, తెలంగాణ రాజకీయనేత బాబూమోహన్ కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆన్ లైన్ లో టీడీపీ సభ్యత్వ నమోదు చేయించుకున్న బాబూమోహన్, తన మెంబర్ షిప్ వివరాలను ట్యాబ్ లో చూపిస్తున్న ఫొటోను టీడీపీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకుంది.
బాబూమోహన్ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైంది. ఎన్టీఆర్ పై అభిమానంతో సైకిలెక్కిన ఈ ప్రముఖ కమెడియన్... 1999 ఎన్నికల్లో ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రిగానూ పనిచేశారు.
ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్ (ఇప్పుటి బీఆర్ఎస్)లో చేరారు. 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2018 తర్వాత బీజేపీ కండువా కప్పుకున్న బాబూమోహన్... ఈ ఏడాది మార్చిలో కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్... బాబూమోహన్ ను ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారు.
ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఆయన వరంగల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి తిరిగొచ్చారు. అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి బాబూమోహన్ పాత గూటికే చేరారు.