కెనడాలో భారత్ సహా విదేశీ విద్యార్థులకు షాక్
- ఉచితంగా ఆహారాన్ని అందించే ఫుడ్ బ్యాంకు సేవల్లో కోత
- మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ నిర్ణయం
- ఇప్పటికే స్టూడెంట్ డిపాజిట్ రెట్టింపు
- తాజా నిర్ణయంతో విదేశీ విద్యార్థులకు ఇక్కట్లు
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి అష్టకష్టాలు పడుతున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులకు అక్కడి ఫుడ్ బ్యాంకులు షాకిస్తున్నాయి. విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఆధారపడే వీటి సేవలపై కోత పెట్టాలని ట్రూడో సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. అదే జరిగితే అక్కడి విదేశీ విద్యార్థులకు ఆహార కష్టాలు తప్పవు.
ఆహారం ధరలు పెరిగిపోతుండడం, నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో మొదటి ఏడాది విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్‌లోని ఫుడ్‌బ్యాంక్ నిర్ణయించింది. ఇక్కడి ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఈ మార్చిలో 20 లక్షల మంది విద్యార్థులు వీటిని ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 6 శాతం ఎక్కువ కాగా, ఐదేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం.
ఉన్నత చదువుల కోసం కెనడా వచ్చే విదేశీ విద్యార్థుల జీవన వ్యయ పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే రెట్టింపు చేసింది. గతంలో ఇది 10 వేల డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది జనవరి 1 నుంచి స్టూడెంట్ డిపాజిట్‌ను రెట్టింపు చేసి 20,635 డాలర్లకు పెంచింది. ఇప్పుడు ఫుడ్ బ్యాంకులు కూడా సేవలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.