జ‌గ‌న్ పాల‌న వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారింది: మంత్రి నిమ్మ‌ల‌

  • ఎన్నిక‌ల ముందు హ‌డావిడిగా ప్రాజెక్టును జాతికి అంకితం చేశార‌న్న మంత్రి
  • ప‌నులు అప్ప‌గించి, అవి పూర్తికాకుండానే నిధులు క‌ట్ట‌బెట్టార‌ని విమ‌ర్శ‌
  • ఒక్క గ్రామానికి కూడా పున‌‌రావాస కాల‌నీలు నిర్మించిన పాపాన పోలేద‌ని ఆగ్ర‌హం
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు విష‌య‌మై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ పాల‌న వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల ముందు హ‌డావిడిగా ప్రాజెక్టును జాతికి అంకితం చేశార‌ని విమర్శించారు.

ప‌నులు అప్ప‌గించి, అవి పూర్తికాకుండానే నిధులు క‌ట్ట‌బెట్టార‌ని ఆరోపించారు. 10 క్యూసెక్కులు కూడా లేకుండానే ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం అంటూ ఊద‌ర‌గొట్టార‌ని మండిప‌డ్డారు. ఒక్క గ్రామానికి కూడా పున‌రా‌వాస కాల‌నీలు నిర్మించిన పాపాన పోలేద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.  

గ‌త టీడీపీ పాల‌న‌లో ప్రాజెక్టుకు రూ. 1,373 కోట్లు కేటాయించి, రూ.1,319 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని మంత్రి నిమ్మ‌ల ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఏ ప్రాజెక్టుకు వెళ్లినా జ‌గ‌న్ విధ్వంస‌మే క‌నిపిస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  


More Telugu News