చంపేస్తామంటూ సల్మాన్‌ఖాన్, జీషన్ సిద్దిఖీలకు బెదిరింపులు.. 20 ఏళ్ల నిందితుడి అరెస్ట్
- ఈ నెల 25న సల్మాన్, జీషన్‌కు బెదిరింపులు
- నిందితుడు తయ్యబ్‌ను ఈ ఉదయం నోయిడాలో అరెస్ట్ చేసిన పోలీసులు
- ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తరలిస్తున్న వైనం
ఇటీవల హత్యకు గురైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీ, బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామని బెదిరించిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు ఈ రోజు నోయిడాలో అరెస్ట్ చేశారు. ఈ నెల 25న బెదిరింపులు రాగా, జీషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
జీషన్, సల్మాన్‌కు ఫోన్ చేసి బెదిరించిన నిందితుడు మహమ్మద్ తయ్యబ్ అలియాస్ గుర్ఫాన్ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. నోయిడా సెక్టార్ 39లో తయ్యబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తరలిస్తున్నారు.
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో జీషన్ సిద్దిఖీని కాంగ్రెస్ బహిష్కరించింది. ఆ తర్వాత ఆయన అజిత్ వర్గంలోని ఎన్సీపీలో చేరారు. హత్యకు గురైన ఆయన తండ్రి బాబా సిద్దిఖీ కూడా తొలుత కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎన్సీపీలో చేరారు.
బాబా సిద్దిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. ఆయనను హత్య చేసింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్‌ఖాన్‌తో సన్నిహితంగా మెలుగుతుండడంతోనే ఆయన తమ టార్గెట్ అయ్యారని పేర్కొంది.