మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ భేటీ
- డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి
- అమరావతిని ఏఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరిన లోకేశ్
- ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లకు లోకేశ్ ఆహ్వానం
- లోకేశ్‌తో ఫోటోలు దిగిన మైక్రోసాఫ్ట్ తెలుగు ఉద్యోగులు
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ రెడ్ మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేశ్ తో ఫోటోలు దిగారు. ఏపీకి చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్థాయికి చేరుకున్నారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఉమ్మడి ఏపీలో ఐఏఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేషంగా కృషిచేశారు.
కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ లో మంచి పరిజ్ఞానం కలిగిన సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఆ సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. లోకేశ్‌తో భేటీ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ... మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా ఉందని అన్నారు. అక్టోబర్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్ 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉండి, ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ దాని క్లౌడ్ సేవలు, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్ రంగంలో బలమైన వృద్ధితో 211.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.
ఐటీ హబ్‌లకు సహకారం అందించండి..
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుందని, ప్రస్తుతం 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం అని పేర్కొన్నారు.
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నామని అందుకు సహకరించాల్సిందిగా సత్య నాదెళ్లకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
ఏపీలోని ఐటీ టాలెంట్‌పై దృష్టి సారించండి..
ఏపీ అత్యుత్తమ ఐటీ, ఇంజనీరింగ్ ప్రతిభావంతులను తయారుచేసే బలమైన విద్యా వ్యవస్థను కలిగి ఉందని లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఐటీ నిపుణులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన సేవలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏపీలో ఐటీ, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాల్సిందిగా సత్య నాదెళ్లను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముకగా పేర్కొన్నారు. అందుకే అగ్రిటెక్ కు ఏఐని అనుసంధానించడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు.
దీనికోసం మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్‌లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతో ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వాణిజ్యరంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్ లకు అనువుగా ఉంటాయని తెలిపారు. దీనికి బలమైన పర్యావరణ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుందన్నారు.
ఏఐ క్యాపిటల్‌గా అమరావతిని తీర్చిదిద్దుతాం..
క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఏఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం వంటి స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారం కావాలని సత్య నాదెళ్లతో అన్నారు. ఏఐ ప్రాజెక్టులకు అనువుగా ఉన్న అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమరావతిలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేశారు.
చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, డైనమిక్ టెక్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. ఏపీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఒకసారి రాష్ట్రానికి వచ్చి పరిశీలించాల్సిందిగా మైక్రోసాఫ్ట్ సీఈఓను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రణాళికల్లో అధునాతన సాంకేతికను ఏకీకృతం చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా సత్య నాదెళ్లను కోరారు. ఏపీలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృంద సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.