మోదీ నాలుగవసారి ప్రధాని అవుతారు... బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- నాలుగోసారి ప్రధాని చేసేందుకు కట్టుబడి పనిచేయాలని పార్టీ నేతలకు పిలుపు
- మోదీ ప్రధాని అయిన నాటి నుంచి ప్రత్యేక ప్రేమను చూపుతూ మద్దతిస్తున్నారని ప్రశంస
- ఇటీవల జరిగిన ఎన్డీయే భేటీలో ఆసక్తికర వ్యాఖ్యలు
నరేంద్ర మోదీని నాలుగవసారి ప్రధానమంత్రిని చేసేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలంటూ పార్టీ నేతలకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. మోదీ నాలుగవసారి ప్రధాని అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్డీయే భేటీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఎన్డీయే భేటీలో నరేంద్ర మోడీపై నితీశ్ కుమార్ ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి బీహార్‌కు తిరుగులేని మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం పట్ల ప్రత్యేక ప్రేమను చూపుతూ అభివృద్ధికి పాటుపడుతున్నారని నితీశ్ కుమార్ కొనియాడారు.
రాష్ట్రానికి చక్కగా సేవ చేస్తున్న బీజేపీతో సుదీర్ఘ కాలం నుంచి పొత్తు ఉందని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ పేర్కొన్నారు. బీజేపీ బలమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు. అయితే కొన్ని సంకీర్ణ భాగస్వామ్య పక్షాల ప్రభావంతో కూటమి పలు సవాళ్లను ఎదుర్కొందని ఆయన అంగీకరించారు. ఆర్‌జేడీతో పొత్తు పెట్టుకోవడానికి, తన మునుపటి నిర్ణయాలలో మంత్రి విజేంద్ర యాదవ్‌తో పాటు కొంతమంది వ్యక్తులు కారణమని వ్యాఖ్యానించారు. ‘‘ఈ వ్యక్తులే ఆర్‌జేడీతో జతకట్టమని నాకు సలహా ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.