మ‌ట్టితో చేసిన దీపాలతో ప‌ర్యావ‌రణానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు: మంత్రి పొన్నం ప్రభాకర్

  • మ‌ట్టి దీపాల వాడ‌కంతో కుల‌వృత్తుల‌కు ర‌క్ష‌ణ‌ కలుగుతుందన్న పొన్నం
  • మ‌ట్టితో చేసిన ఉత్పత్తుల వినియోగంతో కుమ్మ‌ర్ల‌కు ఉపాధి అవ‌కాశం అని వెల్లడి
  • చేతివృత్తిదారులకు అవకాశాలు పెంచాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి
మ‌ట్టితో చేసిన ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి, ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంద‌ని తెలంగాణ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. దీపావ‌ళి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని మ‌ట్టి దీపాలు మాత్ర‌మే వినియోగించాల‌ని రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

మ‌ట్టితో త‌యారు చేసిన వ‌స్తువుల‌కు ప్ర‌ధాన్యం ఇవ్వాల‌ని బ‌ల‌హీన వ‌ర్గాల శాఖ మంత్రిగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. మ‌ట్టి చాయ్ క‌ప్పులు, మ‌ట్టితో చేసిన వాట‌ర్ బాటిల్స్ వాడుతూ చేతివృత్తిదారుల‌కు ఉపాధి అవ‌కాశాలు పెంపొందించేందుకు దోహ‌ద‌ప‌డాల‌ని మంత్రి కోరారు.


More Telugu News