విచారణకు రమ్మంటూ రాజ్ పాకాలకు నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ బావమరిది
- ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంలో రాజ్ పాకాలకు నోటీసులు
- ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అతికించిన పోలీసులు
- తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో రాజ్ పాకాల అత్యవసర పిటిషన్
ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీచేసినట్టు మోకిల పోలీసులు తెలిపారు. ఈ కేసులో విచారణకు నేడు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. రాకుంటే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్‌స్పెక్టర్ పేరుతో రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో రాజ్ పాకాల నివాసానికి నోటీసులు అతికించారు.
విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టులో రాజ్ పాకాల అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. భోజన విరామం అనంతరం రాజ్ పాకాల పిటిషన్‌ను కోర్టు విచారించనుంది.