బాలీవుడ్ స్టార్ హీరోతో విడిపోవ‌డంపై ఐశ్వ‌ర్యరాయ్ షాకింగ్ కామెంట్స్‌!

  • స‌ల్మాన్‌తో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు చాలా స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌న్న బ్యూటీ
  • ఆ రోజుల‌ను త‌న జీవితంలో చీక‌టి రోజులుగా పేర్కొన్న వైనం
  • ఆ హీరో త‌న‌ను శారీర‌కంగా, మాన‌సికంగా హింసించాడ‌ని వ్యాఖ్య‌
మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యరాయ్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో ఈ బ్యూటీ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌తో కొంతకాలం ప్రేమాయ‌ణం న‌డిపిన‌ విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ గురించి తాజాగా ఆమె పాల్గొన్న ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ ప్ర‌శ్నించారు. దానికి ఐష్ షాకింగ్ సమాధానమిచ్చారు.

సల్మాన్‌తో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ట్టు ఐశ్వర్య తెలిపారు. ఆ రోజుల‌ను త‌న జీవితంలో చీక‌టి రోజులుగా అభివర్ణించారు. ఆ హీరో త‌న‌ను శారీర‌కంగా, మాన‌సికంగా హింసించిన‌ట్టు  తెలిపారు. అందుకే ఆయ‌న‌తో విడిపోవాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆమె వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 


More Telugu News