నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం

  • రాజ్యాంగానికి ఆమోదం లభించి నవంబర్ 26 నాటికి 75 ఏళ్లు పూర్తి
  • నాటి పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే ఉభయ సభల సమావేశం
  • ఇప్పటి వరకు చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించి ప్రస్తావనకు వచ్చే అవకాశం
వచ్చే నెల 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న ఉభయసభలు సమావేశం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాలులోనే ఉభయసభల సభ్యులు సమావేశమవుతారు. 1950 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

 రాజ్యాంగానికి ఆమోదం లభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్స్‌, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల గురించిన విషయాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గతంలో నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్పవంగా నిర్వహించేవారు. అయితే 2015లో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు.


More Telugu News