తిరుపతిలో రెండు హోటళ్లు, వరదరాజస్వామి ఆలయానికి బాంబు బెదిరింపులు

  • ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు
  • రంగంలోకి స్నిఫర్ డాగ్స్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు
  • ఆ బెదిరింపులు ఉత్తుత్తివేనని తేల్చిన పోలీసులు 
ఇటీవల దేశంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల విమానాలకు తరచుగా బెదిరింపు కాల్స్ వస్తుండడం తెలిసిందే. తాజాగా, ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని పలు హోటళ్లకు వరుసగా మూడో రోజు కూడా బెదిరింపులు వచ్చాయి. నేడు రెండు హోటళ్లు, ఒక ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఇవి ఉత్తుత్తి బెదిరింపులు అని తేలిందని వారు స్పష్టం చేశారు. 

రెండు హోటళ్లకు, వరదరాజస్వామి ఆలయానికి ఇవాళ ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ఆందోళన నెలకొంది. హోటళ్లు, ఆలయ ప్రాంగణంలో బాంబులు ఉన్నట్టు ఆ ఈమెయిల్స్ సారాంశం. దాంతో, హోటళ్ల యాజమాన్యాలు, ఆలయ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. 

వెంటనే స్పందించిన పోలీసులు స్నిఫర్ డాగ్స్ ను, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను రంగంలోకి దింపారు. క్షుణ్ణంగా సోదాలు చేసినప్పటికీ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News