ఈ నెల 31న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
- అక్టోబరు 31న దీపావళి
- సిఫారసు లేఖలపై వీఐపీ దర్శనాలు అనుమతించబోమన్న టీటీడీ
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు
తిరుమలలో అక్టోబరు 31న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని ఆ రోజున టీటీడీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో, దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. దీనిపై టీటీడీ స్పందిస్తూ, అక్టోబరు 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.