రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన

  • గతరాత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసులు దాడులు
  • నేడు రాజ్ పాకాల విల్లాలో తనిఖీలకు ఎక్సైజ్ అధికారుల యత్నం
  • రాజ్ మరో విల్లాలో ఉన్నాడని అధికారులకు సమాచారం
  • తనిఖీలకు యత్నించిన అధికారులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసుల దాడుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. తాజాగా, రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. 

అసలేం జరిగిందంటే... రాయదుర్గంలోని రాజ్ పాకాలకు చెందిన విల్లాలో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. రాజ్ పాకాల విల్లాకు తాళం వేసి ఉండడంతో ఎక్సైజ్ సిబ్బంది వేచి చూశారు. అక్కడికి దగ్గర్లోనే మరో విల్లాలో రాజ్ పాకాల ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. 

దాంతో వారు ఆ విల్లాలో తనిఖీ చేసేందుకు యత్నించారు. తనిఖీలకు యత్నించిన ఎక్సైజ్ శాఖ అధికారులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేపడతారని బీఆర్ఎస్ నేతలు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.


More Telugu News