కోచ్ గా గంభీర్ ఇంకా ఓనమాలు దిద్దుకుంటున్నాడు... త్వరలోనే నేర్చుకుంటాడు: రవిశాస్త్రి
- టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్
- శ్రీలంకలో టీ20 సిరీస్ గెలిచి, వన్డే సిరీస్ ఓడిన టీమిండియా
- బంగ్లాదేశ్ పై టెస్టు సిరీస్, టీ20 సిరీస్ విజయం
- కివీస్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి
- గంభీర్ పై అప్పుడే విమర్శలు చేయడం సరికాదన్న రవిశాస్త్రి
ఇటీవల గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ టీమిండియా కోచ్ గా వ్యవహరిస్తుండగా... ఆ పర్యటనలో టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియా వన్డే సిరీస్ లో ఓటమిపాలైంది. ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్, టీ20 సిరీస్ లు నెగ్గిన టీమిండియా... న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో బొక్కబోర్లాపడింది.
ఈ నేపథ్యంలో, కోచ్ గా గంభీర్ పనితీరుపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ బుడిబుడి అడుగులు వేస్తున్నాడని, అతడింకా ఓనమాలు దిద్దుకునే దశలో ఉన్నాడని అన్నాడు. త్వరలోనే గంభీర్ నేర్చుకుంటాడని, ఈ దశలో అతడిపై విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
"న్యూజిలాండ్ తో రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఇది ఆలోచనలకు పదును పెట్టే అంశమే. అయితే, కోచ్ గా గంభీర్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారీ అంచనాలు ఉండే టీమిండియా వంటి పెద్ద జట్టుకు కోచ్ గా వ్యవహరించడం ఏమంత సులభం కాదు. కోచ్ గా గంభీర్ ప్రారంభ దశలోనే ఉన్నాడు. త్వరలోనే అన్ని విషయాలు అర్థం చేసుకుంటాడు" అని రవిశాస్త్రి వివరించాడు