జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది: పట్టాభి

  • రచ్చకెక్కిన జగన్-షర్మిల ఆస్తుల వ్యవహారం
  • వాళ్ల ఆస్తులతో చంద్రబాబుకు ఏం సంబంధం అన్న పట్టాభి
  • చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ చేసుకున్నారా అంటూ ఆగ్రహం
జగన్-షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని అన్నారు. 

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. తాడేపల్లి ఇంటి నుంచి ఆదేశాలు రాగానే చెప్పింది చెప్పినట్టు చేస్తారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారిందని ప్రచారం చేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. 

"జగన్ కు, తనకు మధ్య 2019లో ఒప్పందం కుదిరిందని షర్మిల చెబుతున్నారు. ఆస్తుల పంపంకం విషయమై ఎంవోయూ జరిగిందని షర్మిల అంటున్నారు. కానీ జగన్ ఆ ఒప్పందానికి కట్టుబడకుండా తనపైనా, తల్లిపైనా కేసు పెట్టినట్టు ఆమె ఆరోపిస్తున్నారు. 

మరి, చంద్రబాబు సమక్షంలో జగన్, షర్మిల మధ్య ఎంవోయూ జరిగిందా? జగన్, షర్మిల కుటుంబ వ్యవహారాలో చంద్రబాబుకు ఏం సంబంధం? లేకపోతే, జగన్ తో చంద్రబాబే కోర్టులో పిటిషన్ వేయించారా? మీ నాయకుడు ఎవరికి చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు? 

సొంత తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చి రచ్చ చేసింది మీ నాయకుడే! పైగా... ఇది చాలా చిన్న విషయం... ఘర్ ఘర్ కీ కహానీ అని జగన్ చెప్పారు. మీరు చేసే తప్పుడు పనులను అందరికీ ఆపాదించే ప్రయత్నం చేయొద్దు" అంటూ పట్టాభి హితవు పలికారు.


More Telugu News