సైకిల్‌పై హీరోయిన్స్‌తో ప్రెస్‌మీట్‌కు వచ్చిన హీరో
- 'క' ప్రెస్‌మీట్ కు సైకిల్‌పై వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం
- తన కెరీర్‌లో 'క' స్పెషల్ చిత్రంగా నిలుస్తుందన్న కిరణ్
- క్లైమాక్స్ హైలైట్ అంటున్న దర్శకుడు
ఈ రోజుల్లో సినిమాలు ప్రేక్షకులకు రీచ్ కావాలంటే సమ్‌థింగ్ స్పెషల్ కంటెంట్‌తో పాటు ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ కావాలి. ముఖ్యంగా చిన్న సినిమాల చిత్ర యూనిట్లు ఈ విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'క' టీమ్ కూడా ఆ బాటలోనే వెళుతోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'క'. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మాత. ఈ నెల 31న చిత్రం విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ఎగ్రెసివ్‌గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి చిత్ర హీరో, హీరోయిన్స్ సైకిల్‌పై విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రెస్‌మీట్ వేదికగా నిలిచిన ప్రసాద్ ల్యాబ్‌లో హీరో, హీరోయిన్స్ సైకిల్‌పై సవారి చేశారు.
ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ చిత్రంలో అందరూ కొత్త కిరణ్ అబ్బవరంను చూడబోతున్నారని తెలిపారు. "ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే 'క'మరో ఎత్తు. నా కెరీర్‌లో మంచి విజయవంతమైన చిత్రంగా ఇది నిలుస్తుందనే నమ్మకం ఉంది. చాలా స్ట్రాంగ్ కంటెంట్‌తో ఈ సినిమా చేశాను.
ఈ చిత్రంలో ఉండే ట్విస్టులు అందరిని అలరిస్తాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ఇరవై నిమిషాలు ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ప్రేక్షకులందరూ 'క'లో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు" అన్నారు. ఈ సినిమా చూసిన అందరూ ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో బయటకి వెళతారని, 'క' చిత్రం ఎవరిని నిరాశపరచదని దర్శకుల్లో ఒకరైన సుజిత్ తెలిపారు.