వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ బహిరంగ లేఖ

  • ఎన్నికల్లో పోటీ నాకు కొత్త కావొచ్చు... పోరాటం మాత్రం కాదన్న ప్రియాంక
  • ప్రకృతి సృష్టించిన బీభత్సాన్ని కళ్లారా చూశానన్న ప్రియాంక గాంధీ
  • ఆ కష్టాల తర్వాత మీరు ముందుకు కదిలిన తీరు స్ఫూర్తిదాయమని వ్యాఖ్య
  • వయనాడ్ ఓటర్లు తనకు మార్గదర్శకంగా నిలుస్తారని ప్రియాంక ఆశాభావం
వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ప్రజలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా "నా ప్రియమైన వయనాడ్ సోదర, సోదరీమణులారా" అంటూ లేఖను పోస్ట్ చేశారు. వయనాడ్ నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండవచ్చు... కానీ ప్రజల తరఫున పోరాటం చేయడం కొత్త కాదు అని అందులో పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం తాను, తన సోదరుడు రాహుల్ గాంధీ మండక్కై, చూరాల్‌మల వెళ్లామని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సాన్ని కళ్లారా చూశానన్నారు. ఆ కష్టాల నుంచి బయటపడి మీరు ముందుకు కదిలిన తీరు స్ఫూర్తిదాయమని పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధిగా పోటీ చేయడం నాకు కొత్త కావొచ్చు... కానీ ఎప్పుడూ ప్రజల తరఫున గళం వినిపిస్తూనే ఉన్నాను అని వెల్లడించారు. ఈ కొత్త ప్రయాణంలో తనకు వయనాడ్ ప్రజలు మార్గదర్శకంగా నిలుస్తారని భావిస్తున్నానని ప్రియాంక పేర్కొన్నారు.


More Telugu News